గురువారం 02 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 01:24:48

ఒక్కరోజే వెయ్యిదాటిన కేసులు

ఒక్కరోజే వెయ్యిదాటిన కేసులు

  • తాజాగా 1,087 మందికి పాజిటివ్‌
  • జీహెచ్‌ఎంసీలో 888 మందికి కరోనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 1,087 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో వెయ్యికిపైగా కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 888 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 74 కేసులు, మేడ్చల్‌ మల్కాజిగిరి 37, నల్లగొండ 35, సంగారెడ్డి 11, వరంగల్‌ అర్బన్‌ 7, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ 5 చొప్పున, నాగర్‌కర్నూల్‌, జనగామ 4 చొప్పున, రాజన్నసిరిసిల్ల 3, సిద్దిపేట, భద్రాద్రికొత్తగూడెం 2 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆరుగురు మృతిచెందారు. ఒక్కరోజే 3,923 నమూనాలను పరీక్షించగా, 2,836 మందికి నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్ధారణ పరీక్షలు చేసిన కేసుల సంఖ్య 79,231కి చేరింది.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు      
శనివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు  
1,087
13,436  
డిశ్చార్జి అయినవారు   
162
4,928
మరణాలు   
 06
243
చికిత్స పొందుతున్నవారు  
   -
8,265








logo