మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:16:38

జూలై 6 నుంచి యథావిధిగా ఎంసెట్

జూలై 6 నుంచి యథావిధిగా ఎంసెట్

  • సెంటర్ మార్చుకొనేందుకు అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో జూలై 6 నుంచి 9వ తేదీవరకు ఎంసెట్- 2020 నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏపీకి చెందిన విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలను మార్చుకోవడానికి మరో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 23లోపు eamcet.tsche.ac.inను సంప్రదించాలని సూచించారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల మార్పు ఉండబోదని స్పష్టంచేశారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూలై 6, 7, 8 తేదీలలో ఇంజినీరింగ్ విభాగం, జూలై 8, 9 తేదీలలో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కలిపి ఉదయం 25 వేలు, మధ్యాహ్నం 25 వేల చొప్పున రోజుకు 50 వేల మందికే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) నిర్వహించనున్నారు. తెలంగాణలో 16, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటుచేశారు. రూ.5 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉన్నది. 


logo