బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 13:54:58

సీఎంఆర్‌ఎఫ్‌కు తెలంగాణ కాటన్‌ మిల్లర్స్ రూ. 35 లక్షల విరాళం

సీఎంఆర్‌ఎఫ్‌కు తెలంగాణ కాటన్‌ మిల్లర్స్ రూ. 35 లక్షల విరాళం

హైదరాబాద్‌ : కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌, ట్రేడర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్‌కు రూ. 35 లక్షల చెక్కును అందజేశారు. సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేసిన వారిలో తెలంగాణ కాటన్‌ మిలర్స్‌, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్‌ ఉన్నారు.


logo