మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:12:04

4 లక్షలు దాటిన టెస్టులు

4 లక్షలు దాటిన టెస్టులు

  • రాష్ట్రంలో రికవరీ రేటు 73.4% 
  • బుధవారం 1,811 మందికి కరోనా
  • 13 మంది మృతి, 821 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బుధవారం 18,263 టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,16,202కు చేరినట్టు గురువారం బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో బుధవారం 1,811 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ య్యింది. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 521 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 151, వరంగల్‌ అర్బన్‌లో 102, కరీంనగర్‌లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్‌లో 44, మహబూబ్‌నగర్‌లో 41, మహబూబాబాద్‌లో 39, సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, రాజన్నసిరిసిల్లలో 30, జోగుళాంబగద్వాలలో 28, భద్రాద్రికొత్తగూడెంలో 27, ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, పెద్దపల్లిలో 21, జయశంకర్‌భూపాలపల్లిలో 20, వరంగల్‌రూరల్‌, ఆదిలాబాద్‌, మం చిర్యాలలో 18 చొప్పున, యాదాద్రిభువనగిరి, ములుగులో 16 చొప్పున, మెదక్‌, జగిత్యాలలో 15 చొప్పున, వికారాబాద్‌, నిర్మల్‌లో 12 చొప్పున, కామారెడ్డిలో 11, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో 9 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌లో 6 కేసులు వెలుగుచూశాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 13 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 505కు చేరుకున్నది. ఇక ఒక్కరోజే 821 మంది డిశ్చార్జి కాగా, మొత్తం డిశ్చార్జిల సంఖ్య 44,572కు చేరుకున్నది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
బుధవారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
1,811
60,717 
డిశ్చార్జి అయినవారు
821
44,572
మరణాలు
13505
చికిత్స పొందుతున్నవారు
-15,640


logo