శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 10, 2020 , 03:13:18

కరోనా కేసులు 1,410

కరోనా కేసులు 1,410

  • జీహెచ్‌ఎంసీలో 918 మందికి కరోనా
  • ఏడుగురి మృతి, 913 మంది డిశ్చార్జి
  • 30 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు
  • దవాఖానల్లో ఖాళీగా 15,529 బెడ్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం కొత్త మరో 1,410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 918 వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 125, సంగారెడ్డి 79, మేడ్చల్‌ మల్కాజిగిరి 67, వరంగల్‌ అర్బన్‌ 34, కరీంనగర్‌ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్లగొండ 21, నిజామాబాద్‌ 18, మెదక్‌ 17, ఖమ్మం 12, సూర్యపేట 10, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల 8 చొప్పున, వరంగల్‌ రూరల్‌ 7, జయశంకర్‌ భూపాలపల్లి 6, వికారాబాద్‌, మహబూబాబాద్‌లో 5 చొప్పున, జోగుళాంబ గద్వాల, వనపర్తి, జనగామ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి 2 చొప్పున, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

కరోనాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,40,755 పరీక్షలుచేయగా, 30,946 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మొత్తం 331 మంది మరణించారు. ఇప్పటివరకు చికిత్స అనంతరం మొత్తం 18,192 మంది డిశ్చార్జి కాగా, గురువారం 913 మంది కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఉన్న కొవిడ్‌ దవాఖానల్లో చికిత్స నిమిత్తం మొత్తం 17,081 పడకలు సిద్ధంగా ఉండగా, ఇందులో 1,552 పడకలు మాత్రమే భర్తీ అయ్యాయని, 15,529 పడకలు ఖాళీగా ఉన్నాయని స్పష్టంచేసింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు     
 గురువారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,410
30,946  
డిశ్చార్జి అయినవారు
913
18,192
మరణాలు
7331
చికిత్స పొందుతున్నవారు
-12,423


logo