సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 20:43:44

తెలంగాణలో 1198 కరోనా కేసులు

తెలంగాణలో 1198 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం 1198 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 510 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 46,274 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 422కు చేరింది. ఇవాళ 1885 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 34,323మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,530 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 11,003 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,65,219 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 510, రంగారెడ్డి 106, కరీంనగర్‌ 87, మేడ్చల్‌ 76, వరంగల్ అర్బన్‌ 73, మహబూబ్ నగర్‌ 50, జగిత్యాల, మహబూబాబాద్‌లలో 36 చొప్పున, నిజామాబాద్‌లో 31, నాగర్‌ కర్నూల్‌లో 27, జయశంకర్‌ భూపాలపల్లిలో 26, నల్లగొండలో 24, మెదక్‌ జిల్లాలో 13 కేసులు, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో 12 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో 11, ములుగు జిల్లాలో 9 కేసులు, పెద్దపల్లిలో 8,  జగదాంబ గద్వాల, సిద్దిపేట, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున,  వరంగల్ రూరల్ నిర్మల్‌, భువనగిరి యాదాద్రిలలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.


logo