శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 22:34:12

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శుక్రవారం 1,478 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 806 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 42,496 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 403కు చేరింది. ఇవాళ 1,410 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 28,705 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 13,389 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం 15,124 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,22,693 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.logo