ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 01:03:51

రేవంత్‌ హైడ్రామా రంగారెడ్డి జిల్లా జన్వాడలో

రేవంత్‌ హైడ్రామా రంగారెడ్డి  జిల్లా  జన్వాడలో
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సొంత పూచీకత్తుపై విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/రామచంద్రాపురం: చేసిన తప్పునకు జవాబు చెప్పడం తెలియకపోతే ఏంచేయాలి.. ఎదురుదాడి చేయాలి.. తన అక్రమాల బండారం బట్టబయలైతే ఏంచేయాలి.. ఎదుటివారిపై బురద చల్లాలి.. తన అవినీతి లోగుట్టు బయటపడవద్దంటే ఏంచేయాలి.. అక్కరలేని డ్రామాలు ఆడాలి.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే కోవలో కొన్నిరోజులుగా తనపై వస్తున్న ఆరోపణలకు స మాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడు తూ సరికొత్త డ్రామాకు తెరలేపారు.  ప్రభుత్వంలోని పెద్దలు అక్రమాలు చేశారని, వాటిని  బయటపెడతానని సోమవారం రేవంత్‌రెడ్డి మీడియాకు కొత్తకథ చెప్పారు. అన్నింటికీ ఆధారాలు చూపిస్తానన్న సదరు ఎంపీ.. ఆధారాలు చూపకుండా  రంగారెడ్డి జిల్లాలోని జ న్వాడకు తీసుకెళ్లారు.


మీడియా ప్రతినిధులను ఓ కారులో ఎక్కించి.. ఆయన మరోదారిలో జన్వాడకు వెళ్లారు. జన్వాడకు వెళ్తున్న రేవంత్‌ అనుచరులను పోలీసులు ఖానాపూర్‌ వద్ద నిలిపివేశారు. మరోమార్గంలో జన్వాడకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అక్రమాలంటూ అక్కడ షోకు యత్నించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్సీపురం పోలీసులు ఆయనను స్టేషన్‌కు తరలించారు. విష యం తెలుసుకొన్న ఆయన అనుచరు లు ఠాణాకు చేరుకొన్నారు. అనంతరం రేవంత్‌ను పోలీసులు సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. వాస్తవంగా ప్రభు త్వ పెద్దలు అక్రమాలకు పాల్పడి ఉం టే.. అందుకు ఆధారాలు తన వద్ద ఉం టే.. వాటిని హైదరాబాద్‌లోనే మీడియాకు చూపించవచ్చు. కానీ మీడియా సమావేశం నిర్వహిస్తే గోపన్‌పల్లిలో తానుచేసిన భూ అక్రమాలను ప్రశ్నిస్తారని సరికొత్త నాటకానికి తెరతీశారు.


logo