e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ ఈటల మాటలు.. ప్రజల తూటాలు

ఈటల మాటలు.. ప్రజల తూటాలు

ఈటల మాటలు.. ప్రజల తూటాలు
 • మాజీమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం

హైదరాబాద్‌, జూన్‌ 19(నమస్తే తెలంగాణ): చేసిందే తప్పు.. పైగా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దొంగ వేషాలు వేస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. శనివారం హుజూరాబాద్‌లో విలేకరులతో ఈటల మాట్లాడిన మాటలపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇన్నేండ్లు ఖ్యాతి, గౌరవం, హోదా అనుభవించి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజల ఆత్మగౌరవం అంటూ తన ఆస్తుల రక్షణకు వెంపర్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈటల మాటలకు తూటాల్లాంటి ఎదురు ప్రశ్నలు, సమాధానాలతో చెంప చెల్లుమనిపించే రిైప్లె ఇచ్చారు.

ఈటల మాట

 • బండి సంజయ్‌ స్ఫూర్తితో కాషాయ జెండా ఎగరేస్తాం
 • హుజురాబాద్‌లో కారు గుర్తుకు డిపాజిట్‌ కూడా రాదు
 • ఇతర పార్టీల నేతల్ని కొనుగోలు చేస్తున్నారు
 • పోలీసులకు హెచ్చరికలు
 • ఊరికి 50 లక్షలు, కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌
 • న్యాయానికి, అన్యాయానికి, ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నికలు
 • నన్ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయలేదా
 • తెలంగాణలో అభివృద్ది జరగలేదు
 • ప్రజల పరిస్థితి బిచ్చగాళ్లలా నెలకొన్నది

ప్రజల తూటా

 • రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన నీకు స్ఫూర్తా? పదవుల కోసం ఎంతకు దిగజారావు ఈటలా.
 • ఇన్నేండ్లుగా నువ్వు ఏ గుర్తు మీద గెలిచావో మర్చిపోయావా ఈటల. అక్కడ పార్టీ నుంచి నువ్వు వెళ్లిపోయావే తప్పా.. ప్రజలు కాదు.
 • మరి నిన్ను బీజేపీ వాళ్లు ఎంతకు కొన్నారో ఆ ముచ్చట కూడా ప్రజలకు చెప్పు.
 • ఇన్నేండ్లుగా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులను హెచ్చరించడం న్యాయమేనా? వాళ్లు లేకపోతే నీ పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించుకో.
 • మరి ఇన్నేండ్లు ఏం చేశావు రాజేంద్ర.. అక్కడ నువ్వే కదా ఎమ్మెల్యేవి. అంటే నువ్వు ప్రజలకు చేసిందేమి లేదని ఒప్పుకున్నట్టేనా?
 • న్యాయం కోసం జరుగుతున్న ఎన్నికలా..? లేక నీ అన్యాయాలను కప్పిపుచ్చుకొనేందుకు నువ్వు తెచ్చిన ఎన్నికలా? ప్రజల ఆత్మగౌరవం ఏమో గానీ నీ ఆత్మగౌరవాన్ని మాత్రం అక్కడ మోదీ, ఇక్కడ బండి సంజయ్‌ వద్ద తాకట్టు పెట్టావు.
 • డిమాండ్‌ చేయకపోతే కేసీఆర్‌ కృషితో వచ్చిన పదవిని అప్పనంగా అనుభవిద్దామనుకున్నావా?
 • 60 ఏండ్లలో జరగాల్సిన అభివృద్ధి సీఎం కేసీఆర్‌ పాలనలో ఆరేండ్లలోనే జరిగిందని ఇన్నిరోజులు నీ నోటితోనే కదా అన్నది. అప్పుడు కనిపించిన అభివృద్ధి ఇప్పుడు కనిపించడం లేదా?
 • ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తే బిచ్చగాళ్లను చేసినట్టా? ఆస్తులు కాపాడుకోవటానికి బీజేపీ ముందు మోకరిల్లి రాజకీయ బిచ్చగాడిగా మారింది నువ్వు కాదా?
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల మాటలు.. ప్రజల తూటాలు
ఈటల మాటలు.. ప్రజల తూటాలు
ఈటల మాటలు.. ప్రజల తూటాలు

ట్రెండింగ్‌

Advertisement