సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 16:42:38

తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నాం: కేసీఆర్‌

తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: 'రైతు బంధును ఐక్యరాజ్యసమితి అభినందించింది. 124 రోజులు కాకతీయ కాలువలు సజీవంగా ఉన్నాయి. యాసంగిలో 38 లక్షల ఎకరాలకు పైగా వరినాట్లు వేశారు.  తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నామని' ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు.

దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిది. కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా? కేంద్రం మనకు భిక్ష వేస్తుందా?. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారు.  తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2లక్షలకు పైగా కోట్లు వెళ్లింది. అభివృద్ధి చెందాలంటే అప్పులు చేయాలి తప్పదు. నేడు అత్యధికంగా అప్పులున్న దేశం అమెరికా. తెచ్చిన అప్పు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. కమ్యూనిస్టులు మాట్లాడితే అప్పులంటారు.  మీకు కాలువలు కనిపించడం లేదా? అద్భుతంగా కరెంట్‌ ఇస్తున్నాం? ఇది గ్రోత్‌ కాదా?.   లక్ష కోట్లకు పైగా ఇరిగేషన్‌పై ఖర్చు పెట్టాం. రెండేళ్లలో సగానికి సగం అప్పులు తీరిపోతాయి. 23 జిల్లాలున్న ఏపీకి సమానంగా ఉంది మన బడ్జెట్‌.  

టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో విజయ డైరీని నాశనం చేశారు. అప్పుల్లో ఉన్న విజయ డైరీని లాభాల్లోకి తెచ్చాం.  రూ.30కోట్ల నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని ఆదుకున్నాం.  కల్యాణలక్ష్మీ మా ఎన్నికల వాగ్దానం కాదు.. అయినా లక్ష నూటపదహారు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ ఎప్పుడైనా మద్య నిషేధం చేశారా..?   కాంగ్రెస్‌ హయాంలో బెల్టు షాపులే లేనట్టు మాట్లాడుతున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి సమయంలో మద్యపాన నిషేధం పెడితే అట్టల్‌ ఫ్లాప్‌ అయింది. ఎన్టీఆర్‌ హయాంలో ప్రొహిబిషన్‌ పెట్టి ఎత్తివేశారు. ఏ ప్రభుత్వమైనా కరెంట్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతుంది. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం కాబట్టి చార్జీలు పెంచక తప్పదని కేసీఆర్‌ వెల్లడించారు. 


logo