శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:18

సాంస్కృతిక వైభవానికి చిహ్నం బతుకమ్మ

సాంస్కృతిక వైభవానికి చిహ్నం బతుకమ్మ

  • రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతి ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని సూచించారు. 

స్పీకర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేది బతుకమ్మ పండుగ అని, మహిళలు సంతోషంగా జరుపుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.