మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 14:08:39

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు  ప్రగతిభవన్‌లో  మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో   సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో  వ్యవసాయం, కోవిడ్‌-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై  కేబినెట్‌లో  చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  



logo