ఆదివారం 24 మే 2020
Telangana - Mar 03, 2020 , 18:06:54

కర్రపెండలం పంటకు మంచి డిమాండ్: మంత్రి నిరంజన్ రెడ్డి

కర్రపెండలం పంటకు మంచి డిమాండ్: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : కర్రపెండలం సాగుకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కర్రపెండలం పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతోపాటు ఆరుతడి ద్వారా కర్రపెండలం సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తమిళనాడులో సేలం సమీపంలోని ఏతాపూర్ లో ఉన్న కర్రపెండలం, ఆముదం పరిశోధన, విత్తనోత్పత్తి క్షేత్రాలనుమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్రపెండలం నుండి సాపుదనా (సగ్గుబియ్యం), గంజిపొడి, చిప్స్ తయారీతోపాటు దాదాపు 18 రకాల వస్తువుల తయారీ చేయవచ్చన్నారు. కర్రపెండలంను వస్త్ర పరిశ్రమలో వినియోగించనున్నట్లు తెలిపారు. కర్రపెండలం పంట కాలం 7 నుండి 10 నెలలు. వర్షాధారంతో 12 టన్నులు, ఆరుతడితో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చన్నారు. తక్కువతేమ, ఉష్ణోగ్రత గల తెలంగాణ నేలలు కర్రపెండలం పటం సాగుకు అనుకూలం. దక్షిణాఫ్రికాలో కర్రపెండలం సాగు అధికం. ఏపీలో 80 వేల ఎకరాలలో కర్రపెండలం సాగు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో సాగు పెరిగిందని చెప్పారు. కర్రపెండలం సాగుకు సహకారం  ప్రభుత్వం సహకారం అందించనుంది. అధిక దిగుబడి ఇచ్చే కర్రపెండలం సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. 


రైతాంగం సాంప్రదాయ పంటల సాగుతో ఆదాయం కోల్పోతున్నాయని భావించిన సీఎం కేసీఆర్..పంట కాలనీల ఏర్పాటు, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం అందిస్తున్నారు. పంటలమార్పిడితో అధిక దిగుబడి, గిట్టుబాటు ధర వస్తుందని మంత్రి పేర్కొన్నారు.  వెయ్యి ఎకరాలలో కర్రపెండలం సాగు చేస్తే పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు మంత్రి వెల్లడించారు.  తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు మాట్లాడుతూ.. ఆరుతడి కింద పాలమూరు జిల్లాలో ఆముదం విత్తనోత్పత్తి సాగుకు రైతులను ప్రోత్సహిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. వర్షాధారం కింద రంగారెడ్డి, నల్లగొండలలో ఆముదం సాగవుతుంది. వివిధ రకాల ఆయిల్, సబ్బులు, ఆయింట్ మెంట్లలో ఆముదం వినియోగింనున్నట్లు తెలిపారు. త్వరలో కర్రపెండలం పంట సాగవుతున్న ప్రాంతాలలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. 
logo