బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 10:23:06

మ‌రికాసేప‌ట్లో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

మ‌రికాసేప‌ట్లో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

హైద‌రాబాద్ : ‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటించి, విధిగా మాస్కు ధ‌రించాల‌ని శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో తొలుత ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి నివాళులర్పిస్తారు. అనంత‌రం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తారు. ఆ త‌ర్వాత బీఏసీ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ ప‌ని దినాల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.


logo