శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 10:20:49

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టి ఆమోదించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టారు. విప్‌ ప్రభాకర్‌ తీర్మానాన్ని బలపరిచారు. అదేవిధంగా శాసనసభలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే వివేకానంద తీర్మానాన్ని బలపరిచారు.  ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది.


logo