మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 11:00:30

రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ్టి ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేశారు. సభ‌లో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా చ‌ర్చ చేప‌ట్టి, భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం కోర‌నుంది. 

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. శాస‌న‌స‌భ‌లో రేపు కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 10, 11వ తేదీల్లో కొత్త రెవెన్యూ చ‌ట్టంపై చ‌ర్చ నిర్వ‌హించ‌నున్నారు. ‌


logo