గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 11:43:47

13, 14 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ

13, 14 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ

హైద‌రాబాద్ : ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నారు. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. 14న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది. ఈ స‌మావేశాల్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది. 

గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ మున్సి‌పల్‌ కార్పొ‌రే‌షన్‌ (జీ‌హె‌చ్‌‌ఎంసీ) చట్టాల్లో కొన్ని సవ‌ర‌ణల బిల్లుకు, హైకోర్టు సూచిం‌చిన మరి‌కొన్ని అంశా‌ల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నం‌దున అసెం‌బ్లీని సమా‌వే‌శ‌పరుస్తున్నారు. గత నెల 16న శాస‌న‌సభ, మండలి సమా‌వే‌శా‌లను వాయిదా వేశారు. కానీ, ప్రొరోగ్‌ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో గవ‌ర్నర్‌ అను‌మతి అవ‌సరం లేకుం‌డానే స్పీకర్‌, మండలి చైర్మ‌న్‌లు సమా‌వే‌శా‌లపై నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసి సమా‌వే‌శా‌లను నిర్వ‌హించే అవ‌కాశం ఉన్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo