శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 10:49:06

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి బీఏసీ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 14 పని దినాలకు తగ్గకుండా సమావేశాలు జరగనున్నాయి. ఎన్ని రోజులు, ఎన్ని గంటల పాటు సమావేశాలు జరగాలన్నది కూడా బీఏసీ నిర్ణయించనున్నది. 


logo