మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 14:04:04

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. అనంత‌రం కేంద్ర ప్ర‌తిపాదిత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని స‌భ‌లో సీఎం కేసీఆర్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మ‌ద్ద‌తిచ్చాయి. అనంత‌రం కేంద్ర విద్యుత్ చ‌ట్టం బిల్లు ఉప‌సంహ‌ర‌ణ తీర్మానానికి శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ త‌ర్వాత స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.


logo