ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 23:15:36

ఈ పోలీస్ శిక్షణ సూపర్ గురూ!

ఈ పోలీస్ శిక్షణ సూపర్ గురూ!

హైదరాబాద్: ఒక రాష్ట్రానికి కెప్టెన్ గా సేవలందించినా జాతీయ జట్టులోకి వచ్చే సరికి సరైన సమయానికి మైదానానికి రావాలి, కోచ్ చెప్పినట్లు నడుచుకోవాలి.. లేకపోతే అదే రాష్ట్రానికి పరిమితం కావాల్సి వస్తుంది. . ఈ డైలాగ్ చక్ దే ఇండియా సినిమాలో షారుఖ్ ఖాన్.. మహిళల జట్టును ఉద్దేశించిన చేసిన మాటలు. కొన్నిసార్లు కోచ్ లు కఠినంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. లేకపోతే అనుకున్న ఫలితాలు అందిరావు. మరికొన్ని సమయాల్లో వారితో కలిసిపోయి కోచ్ మాదిరిగా కాకుండా స్నేహితుడిగా పాఠాలు నేర్పాల్సి ఉంటుంది. అప్పుడే కోచ్ చెప్పే పాఠాలు వారి చెవికెక్కవు. తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన ఈ ఆర్ఎస్ఐ ఇస్తున్న శిక్షణ కాస్తా వెరైటీగా ఉంటున్నప్పటికీ.. మారుతున్న కాలంతో పాటు శిక్షణా విధానం కూడా మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నది ఆయన శిక్షణ. 

తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన ఏఎస్ఐ మహ్మద్ రఫీ.. కొత్తగా శిక్షణకు వచ్చే క్యాడెట్లు హోం సిక్ కాకుండా ఉండేలా.. వారిలో జోష్ నింపేలా శిక్షణ ఇస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. 1970 నాటి హిందీ సినిమా హమ్జోలీలో మహ్మద్ రఫీ పాడిన ధల్ గయా దిన్ అనే పాటను రాగయుక్తంగా పాడుతూ కానిస్టేబుల్ క్యాడెట్లతో పరేడ్ చేయించడం ఎంతో వెరైటీగా ఉంది. పాట పాడుతూ వారితో పరేడ్ చేయిస్తూ ఆయన కూడా కాలు కదపడం విశేషంగా ఆకర్శిస్తున్నది.  ఈ  పరేడ్ ను వీక్షించిన ఐపీఎస్ అధికారుల సంఘం ఏఎస్ఐ మహ్మద్ రఫీని కొనియాడుతూ.. ఆయన  శిక్షణ ఇస్తున్న వెరైటీ పరేడ్ ను ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.


logo