పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సామాజికాంశాలకు యాక్షన్‌ను మేళవిస్తూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు బన్నీ. దాని తర్వాతే మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.