మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:13:52

బియ్యం ఎగుమతి హబ్‌గా తెలంగాణ

బియ్యం ఎగుమతి హబ్‌గా తెలంగాణ

  • మధుమేహ రోగులకు మేలుచేసే మన సన్నాలు
  • వరి పండే జిల్లాల్లో డ్రైపోర్టులు అవసరం
  • నిజామాబాద్‌ జిల్లాలో ఐసీడీ ఏర్పాటుచేయాలి
  • వినోద్‌కుమార్‌కు ఎఫ్‌టీసీసీఐ నివేదిక సమర్పణ

హైదరాబాద్‌, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు బియ్యం దిగుమతులు సమృద్ధిగా ఉన్నాయని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) పేర్కొన్నది. మనవద్ద పండే సన్నాల్లో తక్కువ గ్లూకోజ్‌ స్థాయి ఉండటం మధుమేహ బాధితులకు ఎంతో మేలుచేస్తాయని తెలిపింది. ‘తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి- ముందుకుసాగే అవకాశాలు’ అనే అంశంపై రూపొందించిన నివేదికను ఎఫ్‌టీసీసీఐ బుధవారం రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అందజేసింది. పలుజిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించి రూపొందించిన నివేదికపై మంత్రుల నివాసంలో వినోద్‌కుమార్‌తో సమావేశమైన ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కే భాస్కర్‌రెడ్డి, సీఈవో ఖ్యాతి నరవనే, డిప్యూటీ సీఈవో టీ సుజాత చర్చించారు. 

ప్రాజెక్టులతో భారీగా ధాన్యం దిగుబడి

సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన ప్రాజెక్టులతో నీటి లభ్యత పెరిగి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా వచ్చిందని తెలిపారు. దీంతో బియ్యం నిల్వలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, మెదక్‌ తదితర జిల్లాల్లో డ్రైపోర్ట్‌లను ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ ధాన్యం కొనాలని ఎఫ్‌టీసీసీఐ సూచించింది. దీనిద్వారా రవాణా ఖర్చులు తగ్గే వీలుందని పేర్కొన్నది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, లేక జానకంపేటలలో ఇన్లాండ్‌ కంటెయినర్‌ డిపో (ఐసీడీ) ఏర్పాటుచేయాలని సూచించింది. ప్రధానంగా ఫిలిప్పీన్స్‌, వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌ దేశాలకు రాష్ట్రం నుంచి ఎగుమతులు అధికంగా ఉన్నాయని తెలిపింది. 

రాష్ట్రం నుంచి ఐదు దేశాలకు బియ్యం ఎగుమతుల వివరాలు (ఎగుమతులు టన్నుల్లో.. విలువ రూ.కోట్లలో)


logo