మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 15:52:11

నీటి వినియోగం, ఆవాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయండి!

నీటి వినియోగం, ఆవాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయండి!

హైదరాబాద్‌: తెలంగాణలో నీటి వినియోగం, ఆవాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను మంత్రి నిరంజన్‌ రెడ్డి కోరారు.  పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నామన్నారు. సాగునీరును సమర్థంగా వాడుకునేందుకు నీటి వినియోగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆవాల పంట ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు జగిత్యాలలో పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీరు కలుషితం కాకుండా సాగునీటి యాజమాన్యం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. logo
>>>>>>