శుక్రవారం 29 మే 2020
Telangana - May 06, 2020 , 03:05:59

న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు

న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు

న్యాయవాదుల కష్టం చూడాలని తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ కోరుతున్నది. దీనిపై క్యా బినెట్‌లో చర్చించాం. యువ, పేద న్యాయవాదులను ఆదుకోవాలని నిర్ణయించి రూ.25 కోట్ల ను మంజూరు చేశాం. తక్షణం రూ.15 కోట్లు విడుదల చేశాం. ట్రస్ట్‌లాగా ఏర్పాటుచేసి.. అడ్వకేట్‌ జనరల్‌ను చైర్మన్‌గా, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించాం. రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ఈ డబ్బులు ధర్మంగా ఎవరికి అందాలో వారికి వితరణ చేయాలని చెప్పాం. అవసరం ఉంటే మిగతా డబ్బు కూడా దశలవారీగా విడుదల చేస్తాం.logo