గురువారం 16 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 01:20:23

పదోతరగతి గ్రేడ్లు విడుదల

పదోతరగతి గ్రేడ్లు విడుదల

  • త్వరలో స్కూళ్లకు మార్కుల మెమోలు
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పదోతరగతి విద్యార్థుల గ్రేడ్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రేడ్లను ఎస్ బోర్డు అధికారిక వెబ్ పొందుపరిచినట్టు వివరించారు. ఇంటర్నల్ అసెస్ ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 5,34,903 మంది విద్యార్థులకు జీపీఏ ఇచ్చామని అన్నారు. ఈ గ్రేడ్లు www.bse.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల మార్కుల జాబితాలను ఆయా స్కూళ్లకు పంపుతామని చెప్పారు. మెమోలలో విద్యార్థుల వివరాలకు సంబంధించిన పొరపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి బోర్డు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. జిల్లాలవారీగా సేకరించిన సమాచారం మేరకు 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 1,40,000 మంది ఉన్నట్టు తెలిసింది.   


logo