గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 21, 2020 , 08:27:55

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

మారేడ్‌పల్లి/ఘట్‌కేసర్‌ : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లా, మోతె మండలం, రావిపహాడ్‌కు చెందిన కాకి మహేశ్‌ రెడ్డి(24) పీర్జాదిగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఉంటూ.. క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. కాగా ..  తన సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ స్టేటస్స్‌లో ‘ నేను చేసిన తప్పులు, అప్పుల వల్ల చనిపోతున్నాను, నా చావుకు ఎవరూ కారణం కాదు అని’ పెట్టి సెల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. అనంతరం ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య మహేశ్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే మృతుడికి ఎలాంటి అప్పులు లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    logo