బుధవారం 27 మే 2020
Telangana - May 06, 2020 , 01:21:02

ఇంజినీర్‌ కుటుంబానికి టీఈఈకే అండ

ఇంజినీర్‌ కుటుంబానికి టీఈఈకే అండ

  • నిబంధనల ప్రకారం భార్యకు ఉద్యోగం : సీఎండీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఎర్రగడ్డ ట్రాన్స్‌కో యువ ఇంజినీర్‌ భీంసేన్‌రెడ్డి భార్య గౌతమికి నిబంధనల ప్రకారం ఉద్యోగం కల్పిస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (టీఈఈఏ) అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్‌శెట్టి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు సీఎండీని కలిశారు. భీంసేన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు టీఈఈఏ తరపున రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు నాయకులు వివరించారు. తొలి విడుతగా రూ.1.5 లక్షల చెక్కును సీఎండీ ప్రభాకర్‌రావు చేతుల మీదుగా గౌతమికి అందజేశారు. 


logo