మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:48:37

స్టార్టప్‌లకు సాంకేతిక సాయం

స్టార్టప్‌లకు సాంకేతిక సాయం

ఉచితంగా 1500 పేటెంట్లు: డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రక్షణరంగ పరిశోధనలు, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారుచేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్టార్టప్‌లు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 1500 పేటెంట్లను ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (టీవోటీ) కింద బట్వాడా చేయడంతోపాటు అవి ఉత్పత్తి దశకు చేరేవరకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఇందులో మిస్సైల్‌ టెక్నాలజీ, మిలిటరీ పరికరాలు, లైఫ్‌ సైన్సెస్‌ తదితర టెక్నాలజీలు ఉన్నాయన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ: అపర్చునిటీస్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ వరల్డ్‌' పేరుతో నిర్వహిస్తున్న వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు.


logo