సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 17:06:27

దుబ్బాకలో నాలుగు ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు : సీఈఓ

దుబ్బాకలో నాలుగు ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు : సీఈఓ

హైదరాబాద్‌ : దుబ్బాక ఓట్ల లెక్కింపులో నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలున్న నాలుగు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లలో 1669 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఫలితం ఇంకా రాలేదని, రెండు కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించనున్నట్లు చెప్పారు. 136, 157/ఏ పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ తర్వాత.. ఓట్లను క్లియర్‌ చేయలేదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.