ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 10:44:16

హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం

హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌ల‌కు అంత‌రాయం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. రెండు కారిడార్ల‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. ఎల్బీన‌గ‌ర్ - మియాపూర్‌, నాగోల్ - రాయ‌దుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి.  అసెంబ్లీ స్టేష‌న్ వ‌ద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. కార్యాల‌యాల‌కు వెళ్లే స‌మ‌యం కావ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


logo