శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 22:20:04

మట్టిపాత్రలకు సాంకేతిక జీవం

మట్టిపాత్రలకు సాంకేతిక జీవం

కరీంనగర్‌ : మారుతున్న కాలానికనుగుణంగా కులవృత్తిదారులు సాంకేతికతను అందిపుచుకుంటున్నారు. మట్టి పాత్రలను ఇన్నాళ్లూ సారెపై తయారు చేసిన కుమ్మరులు ప్రస్తుతం ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. 20 వేల నుంచి 40 వేల మధ్యలో లభించే ఈ యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పాత్రలు తయారు చేసుకునే అవకాశం ఉండడంతో కరీంనగర్‌ నగర పరిధిలోని ఆరెపల్లిలో పదుల సంఖ్యలో కులవృత్తిదారులు యంత్రాలను వినియోగిస్తున్నారు. వివిధ రకాల కుండలు, కర్రీపాత్రలు, రంజన్లు, వాటర్‌ బాటిళ్లు ఇలా ఎన్నో రకాల పాత్రలు తయారు చేసి, మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన మల్లయ్య అనే కులవృత్తిదారుడు తయారు చేస్తుండగా ‘నమస్తే’ కెమెరా బంధించింది. 


logo