Telangana
- Dec 23, 2020 , 21:30:08
ఇంజిన్లో సాంకేతిక లోపం.. క్షణాల్లో కారు దగ్ధం

పెద్దపల్లి : ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి క్షణాల్లో మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నంద్యాల నుంచి ఎన్టీపీసీ వైపు వెళ్తున్న కారు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తి పొగలు వచ్చాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అప్రమత్తమై బయటకు రాగా క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. కారులోనే వారు అప్రమత్తంగా వ్యవహరించపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
MOST READ
TRENDING