గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 10:00:36

పులి సంచారంతో స్కూల్‌కు వెళ్లని ఉపాధ్యాయులు

పులి సంచారంతో స్కూల్‌కు వెళ్లని ఉపాధ్యాయులు

ఆదిలాబాద్‌ : జిల్లాలోని భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ శివారులో మళ్లీ  పులి సంచారం కనిపించింది. పులి సంచారంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లడం లేదు. పదిహేను రోజులక్రితం పశువులపై పులి వరుస దాడులు చేసి బెంబేలిత్తించింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి పులి తరచుగా భీంపూర్‌ మండలంలోకి ప్రవేశిస్తుంది. పులి సంచారంతో పెన్‌ గంగా సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.


logo