మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 08:48:34

ఆన్‌లైన్‌లో టెట్‌?

ఆన్‌లైన్‌లో టెట్‌?

హైద‌రాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హ‌త కోసం నిర్వ‌హించే టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ టెస్ట్‌(టెట్‌)ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించాల‌ని రాష్ర్ట పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌తిపాదించింది. ఎంసెట్‌, డీఎడ్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల మాదిరిగానే టెట్‌ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వ అనుమ‌తి కోరింది పాఠ‌శాల విద్యాశాఖ‌. ఒక‌సారి టెట్ పాస‌యితే జీవిత కాలం విలువ ఉంటుంద‌ని ఇటీవ‌లే జాతీయ ఉపాధ్యాయ విద్యామండ‌లి(ఎన్‌సీటీఈ) తీర్మానించిన విష‌యం విదిత‌మే. కానీ తెలంగాణ‌లో టెట్ పాసయితే దాని విలువ ఏడేళ్ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. ఎన్‌సీటీఈ తీర్మానం నేప‌థ్యంలో రాష్ర్టంలోనూ జీవోకు స‌వ‌ర‌ణ చేయాల‌ని అధికారులు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డ్డ తర్వాత రెండుసార్లు టెట్ నిర్వ‌హించారు. చివ‌రిసారిగా 2017 జులైలో టెట్ నిర్వ‌హించారు.