సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:06

వైఎస్సార్సీపీ నేత హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టు

వైఎస్సార్సీపీ నేత హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత, మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుల వాంగ్మూలం, ఫోన్‌కాల్స్‌ ఆధారంగా ఈ కేసులో కొల్లు రవీంద్రను ఏ-4 నిందితుడిగా చేర్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతారామపురం జాతీయరహదారిపై అతడిని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టుచేశారు. శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. భారీ బందోబస్తు నడుమ రవీంద్రతోపాటు నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. గతనెల 29న భాస్కర్‌రావు హత్యకు గురయ్యారు.logo