శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:42:41

అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్‌

అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్‌

  • ఏపీఐఎంఎస్‌ కుంభకోణంలో 19 మంది ముద్దాయిలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కుంభకోణంలో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి విజయవాడ ఏసీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈఎస్‌ఐ దవాఖానల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో ఆయనను ఏసీబీ శుక్రవారం అరెస్టుచేసింది. శనివారం కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అచ్చెన్నాయుడికి గతంలో ఆపరేషన్‌ కాగా, దానికి సంబంధించి వైద్యనివేదిక అందించాలని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కాగా, స్కాంలో మొత్తం 19 మంది ముద్దాయిలను గుర్తించామని ఏసీబీ జేడీ రవికుమార్‌ తెలిపారు. ఈ కేసులో ఐఎంఎస్‌ డైరెక్టర్లు విజయ్‌కుమార్‌, రమేశ్‌కుమార్‌, జేడీ జనార్దన్‌, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేశ్‌బాబును అరెస్టుచేసినట్టు చెప్పారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 


logo