శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:38:39

టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్‌ దాతృత్వం

టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్‌ దాతృత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అమెరికాలో కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఆకలితో అలమటిస్తున్నవారిని ఆదుకునేందుకు ‘తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) ఫర్‌ అట్లాంటా చాప్టర్‌' ముందుకొచ్చింది. దాదాపు నెలరోజులకుపైగా శ్రమించి దాతలనుంచి విరాళాలు సేకరించినట్టు టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్‌ అధ్యక్షుడు రాజేందర్‌ జనుంపల్లి తెలిపారు. సంస్థ సభ్యులు రాజేందర్‌, బాపూ, కిరణ్‌, సంతోష్‌, మనోహర్‌, నిరంజన్‌, అపర్ణ, లలిత, విక్రం తదితరులు విరాళాలు సేకరించారని చెప్పారు. ఆ డబ్బుతో ఈ నెల 14న రెండు టన్నులకుపైగా ఆహారాన్ని కొనుగోలు చేసి, బాధిత కుటుంబాలకు అందించేందుకు ఎంఎస్జీ ఫౌండేషన్‌కు అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్‌ను  ఎంఎస్జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు షరోన్‌ గుంటెర్‌ అభినందించారు.


logo