శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:38:07

ఎమ్మెల్సీ కవితకు ట్యాక్సీ డ్రైవర్ల వినతి

ఎమ్మెల్సీ కవితకు ట్యాక్సీ డ్రైవర్ల వినతి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినతిపత్రం సమర్పించారు. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రతిపాదించిన సోషల్‌ సెక్యూరిటీ బిల్లులో కేంద్ర ప్రభుత్వం సూచనలు కోరిన నేపథ్యంలో ఓలా, ఉబెర్‌, స్విగ్గి, జొమాటో తదితర యాప్స్‌పై సభ్యులు వినతిపత్రంలో పలు సూచనలుచేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు వినతిపత్రం అందించారు. తమ వినతులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని జాక్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ విజ్ఞప్తిచేశారు.


logo