మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 11:46:26

సిరిసిల్లలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

సిరిసిల్లలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

సిరిసిల్ల క్రైం : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శుక్రవారం అర్ధరాత్రి టాక్స్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు జరిపారు. పట్టణంలోని లక్ష్మీ టాకీస్‌ ప్రాంతంలో దాడులు జరిపి.. వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.25లక్షల విలువైన రాగి, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. పట్టుకున్న రాగి, ఇతర సామగ్రి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో వినియోగిస్తుంటారు. ఈ సామగ్రి అంతా సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ (సెస్‌)కు చెందినదిగా భావిస్తున్నారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి, పట్టుకున్నారు. సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాగి తీగతో పాటు ఇతర సామాను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? ఎవరి నుంచైనా కొనుగోలు చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న రాగి, సామగ్రి విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo