బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 22:43:03

టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడ్డ నిషేధిత, కాలం చెల్లిన మందులు

టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడ్డ నిషేధిత, కాలం చెల్లిన మందులు

కోస్గి టౌన్‌ : టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో నిషేధిత, కాలం చెల్లిన మందులు పట్టుబడిన సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో చోటు చేసుకున్నది. ఎస్పీ చేతన ఆదేశాల మేరకు కోస్గి పట్టణంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీ చేశారు. భవాని ట్రేడర్స్‌లో నిషేధిత గడ్డి మందు సుమారు 22 లీటర్లు పట్టుబడింది. అలాగే శ్రీనివాస ట్రేడర్స్‌లో కాలం చెల్లిన మందు డబ్బాలు పట్టుబడ్డాయి. పోలీస్‌, వ్యవసాయ అధికారులకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సమాచారం అందించడంతో వారు వచ్చి పట్టుబడిన మందులను సీజ్‌ చేశారు. దుకాణ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 


logo