ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 18:12:14

కల్తీ విత్తనాల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌

కల్తీ విత్తనాల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్ : విత్తనోత్పత్తి, మార్కెటింగ్‌, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రబీలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరిసాగు విస్తీర్ణం జరిగింది. పత్తి సాగుపై నియోజకవర్గాల వారీగా అవగాహన కల్పిస్తం. వారం రోజుల్లో అన్ని పంటల వివరాలు సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో నష్టం వాటిల్లిన రైతుల వివరాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. నాణ్యత లేని, నకిలీ విత్తనాలను అరికడుతున్నాం. 

 నాణ్యమైన విత్తన సేకరణలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. కల్తీ విత్తనాల గుర్తింపునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. నిషేదిత రసాయనాలు వాడకుండా టాస్క్‌ఫోర్స్‌ చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఐదువేల ఎకరాలలో పంటల వివరాలను నమోదు చేస్తాం. పంటల వివరాల ఆధారంగా అవసరమైన చర్యలు చేపడతాం. పంటలకు భవిష్యత్‌లో అవసరమైన పెట్టుబడులు, పరికరాలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. 


logo