శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 08:47:01

భారీ వర్షాలకు తెగిన కాగ్నా బ్రిడ్జి.. రాకపోకలు బంద్‌

భారీ వర్షాలకు తెగిన కాగ్నా బ్రిడ్జి.. రాకపోకలు బంద్‌

వికారాబాద్‌: తాండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నా వంతెన తెగిపోయింది. నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో కాగ్నా నది వరద నీటితో పొంగి పొర్లుతున్నది. దీంతో కాగ్నా నదిపై ఉన్న కొడంగల్‌-తాండూరు బ్రిడ్జి తెగిపోయింది. ఈ నేపథ్యంలో తాండూరు, కొడంగల్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురియడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమూనిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వవరకు భారీ వర్షం నమోదయ్యింది.logo