e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

వికారాబాద్ : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో గురువారం పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయినట్లు తేలింది. తన స్నేహితుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.

పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని, ఎవరు ఆందోళన కూడా పడొద్దని కోరారు. అంబేద్కర్ జయంతి సంద‌ర్బంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్నందున అందరూ మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధలను పాటించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

మినీ పుర‌పోరు.. 2 కార్పొరేష‌న్లు, 5 మున్సిపాలిటీల‌కు 30న పోలింగ్
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు
ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు
సిద్దిపేట మున్సిపాలిటీకి రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు
క‌రోనా సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్‌.. మ‌రో ఉద్ధీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించనున్న కేంద్రం!
హాస్పిటల్‌లో బెడ్‌ ఇవ్వండి.. లేదా చంపండి?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

ట్రెండింగ్‌

Advertisement