సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 23:21:19

మనవాళ్ల కోసం.. తానా హెల్ప్‌లైన్‌!

మనవాళ్ల కోసం.. తానా హెల్ప్‌లైన్‌!

కోవిడ్‌-19 ప్రభావంతో అమెరికా హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు.. విద్యాసంస్థలు షట్‌డౌన్‌ అయ్యాయి. భారత విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అమెరికాలో మనవాళ్లు ఎలా ఉన్నారు? ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారు? అనే కంగారు ఇండియాలో ఉన్నవారికీ ఉంది. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) రంగంలోకి దిగింది. కరోనా ముప్పు నుంచి భారతీయులను కాపాడేందుకు తానా కృషి చేస్తోంది. ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. వలంటీర్ల సహకారంతో ఇండియన్స్‌కు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 24X7 హెల్ప్‌లైన్‌ ద్వారా సాయం అందిస్తోంది. ప్రత్యేక ఫిజీషియన్లను ఏర్పాటుచేసి కరోనా వైరస్‌ క్యాంపెయిన్‌ ఏర్పాటుచేసింది. 

అమెరికాలో ఇప్పటివరకు 3,777 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 69 మంది చనిపోయారు. అమెరికా ప్రభుత్వం నివారణా చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అన్ని సంస్థలనూ షట్‌డౌన్‌ చేసింది. అయితే 2.5 కోట్ల మంది భారత విద్యార్థులు అక్కడి 3009 యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వారందరినీ క్షేమంగా ఉంచేందుకు తానా తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. సేవా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ కూడా కరోనాను కట్టడి చేసేందుకు ముందుకొచ్చింది. భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే 10,000 డాలర్లను సహాయనిధికి అందజేసింది. కరోనా ప్రభావం ఉండొచ్చని భావించిన 20 ప్రధాన నగరాల్లో ఇప్పటివరకు 20 మంది ఫిజీషియన్లను.. 400 మంది వలంటీర్లను నియమించి.. భారతీయులకు అండగా నిలుస్తున్నాయి పలు సంస్థలు. logo