మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:00:01

ప్రతి లోగిలి కాంతులతో వెలుగులీనాలి

ప్రతి లోగిలి కాంతులతో వెలుగులీనాలి

  • గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని సీఎం కేసీఆర్‌ ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారం తొలగించి విజ్ఞానపు వెలుగులు ప్రసరించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన దీపావళి జరుపుకోవాలని ఆమె కోరారు.  వచ్చే దీపావళి నాటికి కొవిడ్‌ పీడ పూర్తిగా తొలిగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.