గురువారం 09 జూలై 2020
Telangana - Jan 18, 2020 , 03:41:27

భారతీయతను చాటేవి ఆలయాలు

 భారతీయతను చాటేవి ఆలయాలు
  • అమ్మపల్లి ఆలయ సంబురాల్లో పాల్గొన్న
  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి

శంషాబాద్‌: దేశంలోని పవి్రత్ర దేవాలయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని, భారతీయతను చాటుతాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం నర్కుడ పరిధిలోని ప్రసిద్ధ అమ్మపల్లి శ్రీసీతారామంద్రస్వామి ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేకపూజలు చేశారు. పరంపర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన గుడి సంబురాలకు గవర్నర్‌తోపాటు ఎంపీ రంజిత్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి కుమార్తె పూజ ఆకాంక్షరెడ్డి, పర్‌ విశ్వనాథ్‌, ఉపాధ్యే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. సమాజంలో స్వార్థం పెరిగిందని, దైవచింతన మరిచారని, గ్రామాల్లో రామాయణ, మహాభారత గాథలు ఆలయాల వద్ద వినిపించేవని, ప్రస్తుతం అవి వినిపించడం లేదని తెలిపారు. ఏటా గుడి సంబురాలను వైభవంగా నిర్వహిస్తూ సమాజాన్ని భారతీయత వైపు చైతన్యం చేయడంలో సంస్థ చేస్తు న్న కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు.logo