స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి

- సీఐఐ 2021ఎక్స్‌పోలో గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మనకే ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పిలుపునిచ్చారు. యువతరం అభిరుచులు, ఫ్యాషన్‌కు అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందించాలని, ఈ- కామర్స్ వేదికగా మార్కెటింగ్‌లో దూకుడు పెంచాలని సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021 ఎక్స్పోను వర్చువల్ పద్ధతిలో శనివారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన గొప్ప సంప్రదాయం, కళలు, చేతిపనులు, ఆహారం ప్రపంచానికి తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ కృష్ణ బోదనాపు, సీఐఐ జాతీయ ఐపీ కమిటీ చైర్మన్ రమేశ్ దట్ల, యూఎస్ మేధోసంపత్తి హక్కుల అటాచ్ జాన్ కాబెకా, సీఐఐ ప్రతినిధులు అనిందితా సిన్హా, సుభాజిత్ సహా, జీఐఐపీ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్నరాజా పాల్గొన్నారు.
తాజావార్తలు
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
- ‘వెన్నెల చిరునవ్వై’ సాంగ్ లాంఛ్ చేసిన శంకర్