ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:55:17

తూర్పుపోడా కోడె ప్రతిమ ఆవిష్కరణ

తూర్పుపోడా కోడె ప్రతిమ ఆవిష్కరణ

  • ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలు పొడిగింపు: మంత్రి తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పశుసంవర్ధకశాఖలో పనిచేస్తున్న 530 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలను మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయ ఆవరణలో గురువారం తూర్పుపోడా కోడె ప్రతిమను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నల్లమల అటవీప్రాంతంలోని మన్ననూర్‌, అమ్రాబాద్‌ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎక్కువగా ఉండే ఈ జాతి ఆవులను ఎన్బీఏజీఆర్‌ తెలంగాణ స్థానికజాతిగా గుర్తించిందని చెప్పారు. దీని జీవితకాలంలో 10 కన్నా ఎక్కువ దూడలకు జన్మనిస్తుందని, తక్కువ మేత తిని, రోజుకు కనీసం 20 లీటర్ల పాలు ఇస్తుందని తెలిపారు.logo