మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 01:33:44

గ్రీన్‌చాలెంజ్‌లో తలసాని, నవనీత్‌కౌర్‌

గ్రీన్‌చాలెంజ్‌లో తలసాని, నవనీత్‌కౌర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. తన పుట్టిన రోజు సందర్భంగా సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అద్భుతం.. అందరూ పాల్గొనండి: ఎంపీ నవనీత్‌ కౌర్‌

ఎంపీ సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌చాలెంజ్‌లో తానూ భాగస్వామి కావాలనే ఉద్దేశంతో మొక్కలు నాటినట్టు ప్రముఖ సినీనటి, ఎంపీ నవనీత్‌కౌర్‌ చెప్పారు. గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ బృంద సభ్యులకు మద్దతు తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్ఫూర్తితో రామకృష్ణ మిషన్‌ శిక్షణ మందిర్‌ మంగళవారం పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో 100కుపైగా వేప, జామ, అశోక మొక్కలను పంపిణీ చేసింది.logo