శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 15:24:26

‘డబుల్ స్పీడ్’ తో పనులు చేపట్టండి

‘డబుల్ స్పీడ్’ తో పనులు చేపట్టండి

మహబూబాబాద్ : జిల్లాలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలో ప్రారంభించాల్సి ఉన్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు. 

అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ అదనపు గదుల నిర్మాణం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖాన, కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


logo